విజయసాయిపై అమిత్ షా సీరియస్…?

-

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుల ఇళ్ళపై పెద్ద ఎత్తున ఐటి దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు సహా పలువురుని లక్ష్యంగా చేసుకున్న జీఎస్టీ, ఐటి, ఈడీ సంస్థలు పెద్ద ఎత్తున సోదాలు చేసాయి. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. ఆయన నివాసాలలో ఏ సమాచారం బయటకు రాకుండా రాత్రి సమయాల్లో కూడా సోదాలు చేసారు.

కాని ఎం పట్టుకున్నారు…? ఎం దొరికాయి అనేది తెలియకుండానే సోదాలు అన్నీ ముగిసాయి. సోదాలు చేసి తిరిగి వెళ్ళిపోయారు గాని ఎం దొరికింది అనేది మాత్రం కనీసం మీడియా ముందు కూడా చెప్పలేదు. అలాగే చంద్రబాబు సన్నిహిత టీడీపీ నేతలుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు సహా మరికొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. అయినా సరే ఏమీ దొరికాయి అనేది కూడా మీడియాకు సమాచారం లేదు.

అయితే ఈ దాడుల వెనుక ఉన్నదీ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఝార్ఖండ్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కి ఆర్ధిక సహాయం చేయడంతో పాటు తెరవెనుక చంద్రబాబు కొందరికి సహకారం అందిస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి, అమిత్ షా కు చెప్పారు. దీనితోనే విజయసాయి మాటలు నమ్మిన అమిత్ షా దాడులకు దింపారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ దాడుల్లో ఏమీ దొరకకపోవడంపై అమిత్ షా విజయసాయి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇది తప్పుడు సమాచారమని విజయసాయిని కడిగి పారేసినట్టు తెలుస్తుంది. ఏమైనా దొరికి ఉంటే బాగుండేది అని ఏమీ దొరక్కపోవడంతో విజయసాయి, అమిత్ షా నమ్మకాన్ని కోల్పోయారట. ఆయన చెప్పిన వారిపైనే దాడులు జారిగాయి. దీనితో అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news