ఆనం-కోటంరెడ్డికి జగన్ మార్క్ చెక్..మళ్ళీ గెలవరు?

-

వైసీపీ నుంచి టి‌డి‌పిలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డిలకు జగన్..వచ్చే ఎన్నికల్లో అదిరిపోయే షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ ఇద్దరినీ ఓడించడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. వీరిపై బలమైన అభ్యర్ధులని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరు వైసీపీ నుంచి గెలిచారు. కోటంరెడ్డి..నెల్లూరు రూరల్ నుంచి, ఆనం..వెంకటగిరి నుంచి గెలిచారు.

అయితే ఇద్దరికీ మంత్రి పదవులు దక్కలేదు. అప్పటినుంచి వీరు అసంతృప్తిగానే ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో పనులు జరగడం లేదని గళం విప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వీరిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వీరు టి‌డి‌పి వైపుకు వెళ్లారు. ఇక వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి..నెల్లూరు రూరల్ నుంచి..ఆనం..ఆత్మకూరు లేదా వెంకటగిరి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇద్దరికీ చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నారు.

ఇప్పటికే రూరల్ లో కోటంరెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఫిక్స్ చేశారు. నెల్లూరు ఎంపీగా ఉన్న ఈయన..రానున్న ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేయడం ఖాయం. ఎలాగో రూరల్ లో వైసీపీకి బలం ఉంది. ఇటు ఆదాల ఆర్ధికంగా బలమైన నేత. దీంతో కోటంరెడ్డికి ఆదాల చెక్ పెట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఆనం..వెంకటగిరిలో పోటీ చేసిన..ఆత్మకూరులో పోటీ చేసిన ఓడిపోవడం ఖాయమని తెలుస్తుంది.

ఆ రెండు సీట్లు వైసీపీకి అనుకూలమైన స్థానాలు. పైగా ఆత్మకూరులో మేకపాటి ఫ్యామిలీ ఉంది. ఇటు వెంకటగిరిలో నేదురుమల్లి ఫ్యామిలీ ఉంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. దీంతో ఎటు వచ్చిన ఆనంకు ఓటమి తప్పదు. మొత్తానికి ఈ ఇద్దరికి ఓటమి తప్పదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news