ఆంధ్రప్రదేశ్ యువత అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన టైమ్ ఇది !

-

కరోనా వైరస్ అనే మహమ్మారిని ఎదుర్కొనటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రదేశాలు నానా తిప్పలు పడుతున్నాయి. సైనిక పరంగా టెక్నాలజీ పరంగా మా కంటే వేరే దేశాలు ఏవి లేవు అని మొన్నటి వరకు అనుకున్న దేశాలు ఈ వైరస్ దెబ్బకి భారీ మూల్యం చెల్లించు కుంటున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అని పిలవబడే అమెరికాలో కరోనా వైరస్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. రోజుకి లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా…వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.Coronavirus: Students leave Hyderabad for Andhra after PM ...అయితే ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఎక్కువగా ఉంటున్నది వృద్ధులు. 60 సంవత్సరాలకు పైబడిన వాళ్లకు కరోనా పాజిటివ్ వస్తే ఎక్కువగా బతికే అవకాశాలు లేవని అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇందువల్లనే ఇటలీ దేశంలో ఎక్కువగా వృద్ధులు ఉండటం వల్ల పండుగ వేళ మరణాలు సంభవించాయని ఇంటర్నేషనల్ మీడియా సంస్థ పేర్కొంది.

 

భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో ఎక్కువగా నమోదవుతున్నాయి యువత అని వైద్యులు తెలుపుతున్నారు. అన్ని చోట్లా ఒకేలా ఉంటే ఏపీలో ఈ విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వృద్ధుల పై కంటే యువతపై ప్రభావం చూపడం పట్ల వైద్యులు కూడా షాక్ అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీ లో ఉన్న యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news