కోమటిరెడ్డి కథతో కాంగ్రెస్‌లో మరో మలుపు..?

-

తెలంగాణలో ఇతర పార్టీలది ఒక ఎత్తు అయితే…కాంగ్రెస్ పార్టీది మాత్రం ఒక ఎత్తు అన్నట్లు ఉంది. ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. రెండు పార్టీల నువ్వా-నేనా అన్నట్లు యుద్ధం జరుగుతుంది. ఇక అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ…సొంత రచ్చ సరిచేసుకోవడంలోనే బిజీగా ఉంది. కాంగ్రెస్ నేతలు…ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకునే పరిస్తితి. పైగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ సీనియర్లు ఫైర్ అవుతున్నారు. ఇక జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలాంటి వారు రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఎలా ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే.

komatireddy venkat reddyఅసలు వారు రేవంత్ రెడ్డిని టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగానే వారు అంగీకరించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. మొదటలో కోమటిరెడ్డి…రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మధ్య మధ్యలో జగ్గారెడ్డి…రేవంత్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ సడన్‌గా కోమటిరెడ్డి సైలెంట్ అవ్వగా, జగ్గారెడ్డి స్పీడ్ పెంచారు. రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టడానికి చూశారు. ఇటీవల కాలంలో ఆయన ఏ స్థాయిలో రేవంత్‌ని టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు.

అయితే రేవంత్‌ని టార్గెట్ చేయడంతో..రేవంత్ అనుకూల వర్గం జగ్గారెడ్డిపై ఫైర్ అవుతుంది. ఆయన టీఆర్ఎస్ కోవర్టు అంటూ ప్రచారం మొదలుపెట్టింది. జగ్గారెడ్డి విషయంలో పలు కథనాలు కూడా వచ్చాయి. జగ్గారెడ్డి కూడా రేవంత్ వర్గానికి చెక్ పెట్టడానికి చూశారు గానీ..అది సాధ్యం కాలేదు. ఇక తాజాగా కోమటిరెడ్డి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. కోమటిరెడ్డిని కూడా కోవర్టు అంటూ ప్రచారం చేశారని తెలిసింది.

తాను అనేక ఏళ్లుగా కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నానని..అలాంటి తనని కోవర్టు అంటూ సొంత పార్టీ వారే ప్రచారం చేయడం బాధకరమని, దీనిపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. అంటే ఇక్కడ రేవంత్ టార్గెట్‌గా సీనియర్లు రాజకీయం చేస్తుంటే…రేవంత్ అనుచరులు, సీనియర్లని టార్గెట్ చేశారు. ఇలా కాంగ్రెస్‌లో అంతరయుద్ధం అనేక మలుపులు తిరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news