తెలంగాణలో కరోనా టెర్రర్‌.. 500 మందికి పోలీసులకు పాజిటివ్

-

తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. మూడవ దశలో భాగంగా… ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.. మూడవ దశ లో ఇప్పటి వరకు 500 మంది పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు కూడా చెబుతున్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులను గుర్తించారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే భయపడుతోంది సిబ్బంది. మూడు కమిషనరేట్ పరిధిలో అనేక కేసులు నమోదు అయ్యాయి. పోలీస్ స్టేషన్ కు ఒక్క ఫిర్యాదు దారుడు తప్పా ఎవ్వరు రావొద్దని సూచనలు చేశారు అధికారులు.. ఇప్పటికే పోలీస్‌ శాఖలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. బుస్టర్ డోస్ ను సైతం వేగం పెంచాలని అధికారులకు అదేశాలు జారీ అయ్యాయి. హోమ్ గార్డ్ అధికారి దగ్గరి నుండి ఐపీఎస్ వరకు బుస్టర్ డోస్ తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news