మీడియా సంస్థలకు ఏపీ అసెంబ్లీ కీలక ఆదేశాలు

-

ఏపీ శాసనమండలి కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు కీలక ప్రకటన చేసారు. కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలలో భాగంగా శాసన పరిషత్ అధ్యక్షులు, శాసన సభాపతి ఆదేశాల మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలు రద్దు చేస్తున్నామని చెప్పారు. మేరకు మే 20 నుంచి మీడియా పాయింట్ వద్ద ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అసెంబ్లీ లాబీలలో పాత్రికేయుల ప్రవేశాన్ని కూడా తాత్కాలికంగా నిలుపుదల చేసారు.

అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్న సభ్యులకు, అసెంబ్లీ మీడియా కమిటీచే సిఫార్సు చేయబడి శాశ్వత ఐడీ కార్డ్స్ కల్గిన జర్నలిస్టులు 2020-2021లో జారీ చేసిన ఐడీ కార్డ్ చూపించి తాత్కాలిక ప్రెస్ గ్యాలరీలో పాస్ తీసుకోవాలి అని సూచించారు. అక్కడ కూడా భౌతికదూరం పాటించాలి పాత్రికేయులను కోరుతున్నాం అని అన్నారు. పాత్రికేయులు సహకరించాలని సూచనలు చేసారు. ప్రత్యక్ష ప్రసారాలను అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నిలిపివేసినందున సెక్రటేరియట్ పరిసరాల్లోని బ్లాక్ IV నందు పబ్లిసిటీ సెల్ నుంచి తీసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news