ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు డేట్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల 15న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో పలు కీలకమైన బిల్లులు ఆమోదం పొంద బోతున్నట్లు ఏపీ అధికార పార్టీ వైసీపీ లో టాక్ వినపడుతుంది. గత ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలలో వికేంద్రీకరణ బిల్లు మరియు పలు కీలకమైన బిల్లులు శాసన సభ రద్దు వంటి బిల్లులు ఆమోదం పొందటం ఆ తర్వాత ఇదే అతి పెద్ద రాజకీయ రగడ అవ్వడం ఆ కీలకమైన బిల్లులు ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఉండటం మనకందరికీ తెలిసినదే.
అయితే తాజాగా వచ్చే నెల మార్చి 15వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ వైసిపి పిఆర్ చట్ట సవరణ బిల్లు మూడు రాజధానులు మరియు సి.ఆర్.డి.ఎ బిల్లులకు సంబంధించి వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేలా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఇదే తరుణంలో బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరియు అదే విధంగా స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానులు కు సంబంధించి జగన్ సర్కార్ ని ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్.