ఏపీ సీఎం జగన్ పై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కాసేపటి క్రితం తీవ్ర విమర్శలు చేసారు. వైసీపీ మూసేసే పార్టీ అని, మూడు సంవత్సరాలు తర్వాత ఈ పార్టీ ఉండదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గ్యారంటీగా చెబుతున్నాను రాసుకోండని… మూసేయడం అంటే.. ఈ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి రాదని ఆయన స్పష్టం చేసారు.
ఏడాది క్రితమే తెలుగుదేశం పార్టీ ఒడిపోతుందని చెప్పానన్న ఆయన అదే జరిగింది అన్నారు. నేను కె ఏ పాల్ ని కాదు నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి, జగన్ పాలన పై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారు… ఇప్పుడు వారికి తెల్సింది అది కపట ప్రేమ అంటూ విమర్శలు చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తున్నారు అని విమర్శించారు.