రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చ జరుగనుంది. పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ. 5900 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ప్రైవేట్ యూనివర్శిటీలు, విద్యార్ధులకు లాప్ టాపుల పంపిణీ, భూ సేకరణ చట్టం వంటి అంశాలపై చర్చించనుంది కేబినెట్. అలాగే ఐటీ పాలసీకి కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అలాగే తెలంగాణతో జల వివాదాలు కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ నిర్మించే రాయలసీమ ఎత్తిపోతలను అక్రమ ప్రాజెక్టులనడంపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వమే అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నీటి కేటాయింపుల మేరకే ప్రాజెక్టుల నిర్మాణమని ఏపీ సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనుది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వ జల అక్రమాలపై కేబినెట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే.. జాబ్ క్యాలెండర్ పైనా కేబినెట్లో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.