చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్.. సినిమాలను రాజకీయాలకు వాడుతున్నారు

-

సినిమాలను చంద్రబాబు, లోకేష్ తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేస్తున్నామని ఆరోపిస్తున్నారని… ఓ సినిమా కోసం తండ్రికొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారని విమర్శించారు. హైకోర్ట్ తీర్పు అన్నా.. ప్రభుత్వం అన్నా విపక్ష నేతలకు లేక్కే లేదని ఆయన విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బ్లాక్ టికెట్లు అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. నీతులు చెప్పే ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ విమర్శించారు.perni nani బ్లాక్ లో టికెట్లు అమ్మితే ప్రభుత్వం పట్టించుకోవద్దా…? అని ప్రశ్నించారు. గొప్ప సేవలను అందించినటువంటి మంత్రి గౌతం రెడ్డి చనిపోవడంతో రాష్ట్రం అంతా దు:ఖంలో ఉంది. దీంతో జీవో లేటు అయింది. దీనికి మానవత్వం లేకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు అని విమర్శించారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగజారుతారని విమర్శించారు. మనుషుల విలువ తెలియకుండా.. ఎన్టీఆర్ మరణం సమయంలో కూడా రాజకీయాలు చేశారని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు ఇలాగే చేశారా.. అని చంద్రబాబు, లోకేష్ ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news