“భీమ్లా నాయక్‌” సినిమాను వాయిదా వేసుకోండి : మంత్రి బొత్స

-

భీమ్లా నాయక్‌ సినిమాపై మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బీమ్లా నాయక్ సినిమా టికెట్స్ విషయంపై స్పందిస్తూ మనం ఒక వ్యవస్థలో ఉన్నామని చెప్పారు. చట్టం ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని… వ్యక్తుల కోసం కాదు ..ప్రజల కోసం ఆలోచన చేయాలని కోరారు. సినిమా టికెట్స్ విషయంలో ఒక కమిటీని వేశామన్నారు.

ఆ అంశం ఇంకా నడుస్తుందని… టికెట్లు ధరలు నచ్చకపోతే సినిమాను పోస్ట్ పోన్ చేసుకోండని చురలు అంటించారు. చంద్రబాబుకి ప్రజల సంక్షేమం , అభివృద్ధి పట్టదు. కానీ సినిమా గురించి మాత్రం మాట్లాడుతాడని.. జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను జిల్లా సమీక్ష సమావేసంలో చర్చించామన్నారు.

నాడు-నేడు, ధాన్యం కొనుగోళ్లు , ఉపాధి హామీ పథకం, హోసింగ్ తదితరుల అంశాలు పై చర్చించామని.. ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటిని క్లియర్ చేయమని అధికారులను అదేశించమని వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఉన్న ఆంధ్రా విద్యార్థులు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. అమరావతి రైతులు చేసేది ఉద్యమం కాదు. అది ఒక రాజకీయ ఉద్యమం.., టీడీపీ చేసే ఉద్యమమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news