29 సార్లు ఢిల్లీ వెళ్లా అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఎలా ఇచ్చారో తెలుసా?

-

ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఎటువంటి లాభాలు ఉంటాయి.. ప్రత్యేక హోదా వల్ల ఏపీ ఏవిధంగా నష్టపోయింది.. అనే విషయాలపై ఆయన సభలో వివరించారు. ప్రత్యక హోదాపై జగన్ మాట్లాడుతుండగా మధ్యలో ప్రతిపక్షనేత చంద్రబాబు కల్పించుకొని మాట్లాడబోయారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై సభలో చర్చ జరుగుతోంది. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ప్రత్యేక హోదాపై సభలో తీర్మానం పెట్టారు. ఈసందర్భంగా ప్రత్యేక హోదా తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు.

ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఎటువంటి లాభాలు ఉంటాయి.. ప్రత్యేక హోదా వల్ల ఏపీ ఏవిధంగా నష్టపోయింది.. అనే విషయాలపై ఆయన సభలో వివరించారు. ప్రత్యక హోదాపై జగన్ మాట్లాడుతుండగా మధ్యలో ప్రతిపక్షనేత చంద్రబాబు కల్పించుకొని మాట్లాడబోయారు. దీంతో మధ్యలో మాట్లాడుతానని చంద్రబాబు చెప్పడంతో జగన్.. చంద్రబాబును మాట్లాడాలంటారు. చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆయన మాటలకు జగన్ భలే కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో చప్పట్లు మార్మోగాయి.

ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు.. 29 సార్లు డిల్లీ వెళ్లా

ప్రత్యేక హోదా తీర్మానాన్ని మేం కూడా స్వాగతిస్తున్నాం. హోదాకు ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు. పేరు మార్చి ప్యాకేజీ ప్రకటించారు. నేను హోదా విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. 29 సార్లు ఢిల్లీ వెళ్లాను. 2014 మేలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడాను. తొమ్మిది మంది కేంద్ర మంత్రులను కలిశాను. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేయనని చెప్పా. హోదా ప్రయోజనాలన్నీ కల్పిస్తామంటేనే నేను ప్యాకేజీకి ఒప్పుకున్నానంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్ కౌంటర్ ఇది

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అప్పటి యూపీఏ కేబినేట్ ఆమోదం తెలిపి ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 2015 వరకు ప్లానింగ్ కమిషన్ ఉంది. ప్రత్యేక హోదాను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ ను చంద్రబాబు కోరితే సరిపోయేది. కానీ.. ప్లానింగ్ కమిషన్ ఏడు నెలల పాటు ఉన్నా కూడా అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై కనీసం లేఖ కూడా రాయలేదు. ప్లానింగ్ కమిషన్ దగ్గర ప్రత్యేక హోదా ఉంటే ప్రధాని దగ్గరికి చంద్రబాబు ఎందుకు వెళ్లినట్టు? ఒక లేఖ రాస్తే అయిపోయేదానికి ప్రధాని దగ్గరికి ఎందుకు పోయారు? ఆయన అంటున్న తొమ్మిది మంది కేంద్ర మంత్రుల్లో ఇద్దరు ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న 7 ముంపు మండలాలు ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనన్న చంద్రబాబు.. మరి.. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు అటువంటి స్టాండ్ తీసుకోలేకపోయారు. ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది. ప్రత్యేక హోదా వచ్చేదాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ఎందుకు చెప్పలేదు.. అంటూ కౌంటర్ ఇచ్చారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news