నువ్వు నాకు నీతులు చెబుతున్నావా? నటి వీణా మాలిక్ పై నోరు పారేసుకున్న సానియా

645

సానియా బలవంతం చేయడంతో షోయెబ్ జంక్ ఫుడ్ అక్కడ తిన్నాడట. మద్యం కూడా తాగాడట. సానియా కావాలని భారత్ గెలవాలని చెప్పి అక్కడికి వెళ్లి తన భర్తను ఆ రెస్టారెంట్ కు తీసుకెళ్లి జంక్ ఫుడ్ తినిపించిందని.. మిగితా పాక్ ఆటగాళ్ల మనోస్థయిర్యాన్ని దెబ్బతీసిందంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

అసలు వరల్డ్ కప్ మ్యాచ్ కు సానియా మీర్జాకు సంబంధం ఉందా? లేదు.. కానీ పాకిస్థాన్ జట్టుకు సానియాకు మాత్రం సంబంధం ఉంది. ఎందుకంటే.. సానియా భర్త షోయెబ్ మాలిక్ కాబట్టి. ఆయన పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు కాబట్టి.

అయితే మాత్రం ఇప్పుడు పాకిస్థాన్ ఓడిపోవడానికి షోయెబ్ మాలిక్ కారణం అవుతాడు కానీ.. సానియా ఎలా అవుతుంది.. ఆమె వెళ్లి క్రికెట్ ఆడలేదు కదా అంటారా? అవును.. ఆమె క్రికెట్ ఆడలేదు కానీ.. సానియా.. భారత్, పాక్ మ్యాచ్ ముందు తన భర్త షోయెబ్ మాలిక్ ను తీసుకొని ఓ రెస్టారెంట్ కు వెళ్లిందట. తనను ప్రాక్టీసే చేయనీయలేదట. పాకిస్థాన్ కు చెందిన ఓ మీడియా ఈ కథనాన్ని ప్రసారం చేసింది.

సానియా బలవంతం చేయడంతో షోయెబ్ జంక్ ఫుడ్ అక్కడ తిన్నాడట. మద్యం కూడా తాగాడట. సానియా కావాలని భారత్ గెలవాలని చెప్పి అక్కడికి వెళ్లి తన భర్తను ఆ రెస్టారెంట్ కు తీసుకెళ్లి జంక్ ఫుడ్ తినిపించిందని.. మిగితా పాక్ ఆటగాళ్ల మనోస్థయిర్యాన్ని దెబ్బతీసిందంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

అయితే.. ఇదే విషయంపై పాక్ నటి వీణా మాలిక్ కూడా స్పందించింది. తన ట్విట్టర్ లో సానియాపై విమర్శలు కురిపించింది. అయితే.. డైరెక్ట్ గా షోయెబ్ గురించి మాట్లాడకుండా.. సానియా కొడుకు గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడింది వీణా మాలిక్. సానియా.. నీ కొడుకుకు జంక్ ఫుడ్ ఎలా తినిపించావు. అది ఆరోగ్యానికి మంచిది కాదని నీకు తెలియదా? ముఖ్యంగా అథ్లెట్స్ కు అస్సలు మంచిది కాదనే విషయాన్ని నువ్వెలా మరిచిపోయావు. నువ్వు ఒక తల్లివి.. అంతే కాదు అథ్లెట్ వి కూడా.. అంటూ కొంచెం ఘాటుగానే ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్ పై స్పందించిన సానియా.. వీణాపై విరుచుకుపడింది. తల్లి అయ్యాక కూడా పిల్లల గురించి ఆలోచించకుండా.. మ్యాగజైన్ కు పోజులు ఇచ్చిన నువ్వు నాకు నీతులు చెబుతున్నావా? అంటూ ఫైర్ అయింది. కాకపోతే ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేసింది సానియా. తర్వాత మరో ట్వీట్ చేసి… తన కొడుకును అక్కడికి తీసుకెళ్లలేదని ట్వీట్ చేసింది.

READ ALSO  ఉత్త‌రాంధ్ర‌కు తుఫాను ముప్పు

ఇది నీకు గానీ.. బయటి ప్రపంచానికి గానీ అవసరం లేని విషయం. నాకు తెలుసు.. నాకొడుకును ఎలా చూసుకోవాలో? నేను పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఏమీ డైటీషియన్ కాదు.. తల్లిని కాదు.. టీచర్ ను కూడా కాదు.. అంటూ సానియా ట్వీట్ చేసింది. అలా.. వాళ్లిద్దరి మధ్య ట్వీట్ల వార్ నడిచింది.