కేసీఆర్ కు షాక్ మీద షాకులిస్తున్న జగన్..!

-

ఏపీ సీఎం జగన్ పొరుగు రాష్ట్రం సీఎం జగన్‌కు షాకు మీద షాకులు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న ఆర్టీసీని విలీనం చేసి తెలంగాణ కార్మికుల్లో అసంతృప్తి పెంచేశారు. లక్షల కొద్దీ ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ నిరుద్యోగుల్లో అసంతృప్తికి కారణమయ్యారు. ఇప్పుడు జగన్ కేసీఆర్ కు మరో షాక్ ఇచ్చేలా ఉన్నారు.

ఏపీ, తెలంగాణ సీఎంలు గోదావరి నుంచి శ్రీశైలం ప్రాక్టుకు నీళ్లు తరలించే ప్రాజెక్టుపై జగన్ పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో పలుసార్లు భేటీలు కూడా అయ్యారు. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు కూడా చర్చించారు. ఇందుకు నాలుగైదు మార్గాలు అన్వేషించారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో జగన్ వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే ప్రతిపాదననపై ఏపీలో విపక్షాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ ను నమ్ముకుని తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఏంటని గోల పెడుతున్నాయి. దీనికితోడు ఈ ప్రతిపాదన కంటే తక్కువ వ్యయంతో రాయలసీమను నీళ్లిచ్చే కొత్త ఐడియా ఏపీ ఇంజినీర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఏపీ సంబందించిన రిటైర్డ్ ఇంజనీర్లు పోలవరం నుంచి రాయలసీమకు పెన్నా డెల్టా ద్వారా లిప్ట్ ల ద్వారా తరలించవచ్చని సూచించినట్టు సమాచారం.. ఇందుకు అయ్యే వ్యయం కూడా తక్కువేనని వివరించినట్టు తెలుస్తోంది. గోదావరి నీటిని లిఫ్టుల ద్వారా తెలంగాణతో సంబంధం లేకుండా రాయలసీమకు తరలించాలని వారు సలహా ఇస్తున్నారట.

అందుకే.. జగన్ వచ్చే నెల ఇరవై ఆరున గోదావరి -పెన్నా లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే.. ఇక తెలంగాణలో సంయుక్తంగా చేపట్టాల్సిన ప్రాజెక్టు అటకెక్కినట్టేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ పథకం ద్వారా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చన్నది జగన్ ఆలోచనగా ఉంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news