బ్రేకింగ్ : ఏపీ లో జైళ్ళలో ఉన్న ఖైదీ ల విడుదల ?

-

సీఎం వైఎస్ జగన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లెటర్ రాయడం జరిగింది. కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలులో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేయాలని చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు పై వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటనపై మండిపడ్డారు. వెయ్యి రూపాయలు ఎవరికీ సరిపోవని ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సూచించారు.Image result for jail in indiaఅంతేకాకుండా ప్రస్తుత కీలకమైన సమయంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం నిమిత్తం ప్రజల దగ్గర డబ్బులు భయంకరంగా వసూలు చేస్తున్నారని, తక్షణమే అటువంటి ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఖైదీలను విడుదల చేసేందుకు న్యాయశాఖతో సంప్రదించండి.

 

జైళ్లలో పరిశుభ్రమైన వాతావరణం ఏ మేరకు ఉంటుందో మనకు తెలియంది కాదని, ఏ మాత్రం అలక్ష్యం ఉన్నా జైళ్లలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని దీంతో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాలను బెయిల్ పైన, శిక్షపడిన ఖైదీలను పెరోల్ పైన విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ సీఎం జగన్ ని కోరడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news