జగన్ సర్కార్ కి హైకోర్ట్ బిగ్ షాక్, తక్షణమే తొలగించండి…!

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పంచాయితీ కార్యాలయలపై పార్టీ రంగులు ఉండరాదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే అధికార వైసీపీ రంగులను పంచాయితీ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వేస్తూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపింది. దాదాపు ఎక్కడ చూసినా వైసీపీ రంగులే కనిపించాయి.

చివరకు పిల్లలకు వేసే అవార్డులకు కూడా వైసీపీ రంగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో పంచాయితీ కార్యాలయానికి వైసీపీ రంగు వేయడంపై ఒకరు పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై హైకోర్ట్ లో విచారణ జరపగా ప్రజల సొమ్ముతో నిర్మించిన వాటికి పార్టీ రంగు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తీరుని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.

తాజాగా ఈ అంశంపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. పంచాయితీ ఎన్నికల దృష్ట్యా రంగులను తొలగించాలని ఆదేశించింది. అసలు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించింది కోర్ట్. దీనిపై ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుని రంగులు మార్చాలని స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చెయ్యాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన కోర్ట్, విచారణను ఫిబ్రవరి 5 కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news