జగన్ గారూ… జనాలు తిట్టే పరిస్థితి వస్తుంది జాగ్రత్త…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రేషన్ సరుకుల కోసం ప్రజలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఈపాస్ యంత్రాలు పని చేయకపోవడం తో ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నెట్‌వర్క్‌ సమస్యలతో ప్రజలు ఎక్కువగా అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాల కోసం పేదలు బారులు తీరారు. ఒకరి మీద ఒకరు పడి సరుకుల కోసం ఎక్కువగా పోటీ పడుతున్నారు. వాలంటీర్లు కూడా పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.

సామాజిక దూరం పాటించాలని కేంద్రం చెప్తున్నా ఎంత మంది హెచ్చరిస్తున్నా సరే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్దులు, యువకులు అందరూ కూడా పోటీ పడుతున్నారు. మంగళగిరి లోని పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలు సోమవారం అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోయాయి. నెట్ వర్క్ సరిగా లేకపోవడంతో రేషన్ సరుకుల కోసం వచ్చి జనం బారులు తీరారు.

వాళ్లకు కనీసం జాగ్రత్తలు చెప్పే వాళ్ళు కూడా ఎవరూ లేకపోయారు. వాస్తవానికి గ్రామ,వార్డు వాలంటీర్లు ద్వారా ప్రభుత్వం పేదల ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు కొందరు చేస్తున్న పనికి జనం బలైపోతున్నారు. ఎం చెయ్యాలో అర్ధం కాక చాలా మంది ఎండలోనే పడిగాపులు పడే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. దీనిపై అధికారులు స్పందించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడటం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news