చంద్రబాబు అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలి… స్పీకర్ సంచలన వ్యాఖ్యలు…!

-

అగ్రీగోల్ద్ బాధితులకు ప్రభుత్వం చెక్కులు ఇచ్చిన నేపధ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతిపక్షం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు బాధితులను మోసం చేసారని తాము వారిని ఆదుకున్నామని ప్రభుత్వం చెప్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన మండిపడ్డారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని తమ్మినేని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా? అంటూ స్పీకర్ ప్రశ్నించారు. అదే విధంగా… చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక చంద్రబాబు అనుభవం గురించి మాట్లాడిన స్పీకర్… తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని ఎద్దేవా చేసారు. అలాగే… ఎన్నికల ముందు రూ. 10 వేలు ఇస్తానని చెప్పి అందరి దగ్గర పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా ఇవ్వలేదని తమ్మినేని మండిపడ్డారు.

అంతే కాకుండా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వాలే స్కాంలకు పాల్పడితే ప్రజలేమైపోవాలని తమ్మినేని విపక్షాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. కళ్ల ముందు అన్యాయం జరిగితే స్పీకర్ స్పందించకూడదా అని ఆయన నిలదీశారు. తాను ముందు ఎమ్మెల్యేనని, తర్వాతే స్పీకర్‌నని స్పష్టం చేసారు. చంద్రబాబు ప్రతి ఒక్కటీ మాయ చేశారని తమ్మినేని ఆరోపించారు. అలాగే ఆ పార్టీ నేతలపై కూడా ఆయన ఆరోపణలు చేసారు. యనమల రామకృష్ణుడు, సీఎం రమేష్ తదితరులు హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను కొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news