ఎన్నికలకు ముందు టీడీపీలో అధికార ప్రతినిధిగా ఎంట్రీ ఇచ్చి నానా హడావిడి చేసింది యామిని సాధినేని. ఎన్నికలకు ముందు ఆమె టీవీ చర్చల్లో పార్టీ తరపున నానా రచ్చ చేశారు. ఒకానొక దశలో జనసేన సైనికులకు కూడా బాగా టార్గెట్ అయ్యారు. ఇక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆమె అస్సలు కనపడడం లేదు. అప్పటి నుంచి ఆమె పార్టీ మారుతున్నారని… బీజేపీలోకి వెళ్లిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
కొద్ది కాలంగా యామినీ టీడీపీ వీడుతారనే ప్రచారం సాగినా..యామినీ ఖండించారు. ఇక మధ్యలో ఆమె ఒకసారి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కూడా సమావేశమయ్యారు. అప్పుడే ఆమె పార్టీ మారిపోతారని అందరూ అనుకున్నారు. ఆ టైంలోనే ఆమెతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో ఆమె పార్టీ మార్పు అంశం కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యింది. తాజాగా యామినీ బీజేపీలో అధికారికంగా చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 10న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ పడ్డా విజయవాడకు వస్తున్నారు. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలను ఈ క్రమంలోనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ లిస్టులో టీడీపీ వాళ్లే ఎక్కువుగా ఉన్నారు. ఇక నడ్డా సమక్షంలో యామినీ బీజేపీలో చేరనున్నారు. మాజీ కేంద్ర మంత్రి ఒకరు యామినీని బీజేపీలోకి రావాలని సూచింటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరితే ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇస్తామని చెప్పడంతో ఆమె పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.