100కిపైగా దేవాలయాలపై దాడులు : పవన్‌ కళ్యాణ్‌

-

రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100కిపైగా దేవాలయాలపై దాడులు జరిగాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. వైఎస్సార్‌ పార్టీ నేతలపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు.. కానీ రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలు, గోపురాలు ధ్వంసం చేస్తున్నప్పడు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఆలయాల దాడులపై బుధవారం పవన్‌ కళ్యాణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

pawan kalyan
pawan kalyan

రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో రథాల దగ్ధం, దేవాతామూర్తుల విగ్రహాల ధ్వంసం పేరిట జరుగుతున్న అరాచకంపై మాట్లాడితే ప్రతిపక్షాలు రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ నడిపిస్తున్నాయంటూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం.. బాధ్యత నుంచి తప్పించుకోవడం జరుగుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతున్నారని, ఈ మాటలకు జనం హర్షం వ్యక్తం చేయరని పవన్‌ కళ్యాణ్‌ హితువు పలికారు.

పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అత్యున్నత హోదాలో ఉన్న మీపై గెరిల్లా వార్‌ ఫేర్‌ చేయడానికి ఎవరు సాహసిస్తారు. మీ ఆధ్వర్యంలో 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు, 115 మంది ఐపీఎస్‌లు, మరో 115 మంది అదనపు ఎస్పీలు, వేలాది మంది పోలీసు సిబ్బంది, స్పెషల్‌ ఫోర్స్‌లు ఉన్న మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు.. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు.. వారు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారా.. లోపం ఎక్కడుంది.. మీలోనా లేక వ్యవస్థలోనా..’’ అంటూ ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని చెప్పడం తగదని పవన్‌కళ్యాణ్‌ సూచించారు. రెండేళ్లుగా ఎంతో ఓపిగ్గా న్యాయం దొరుకుతుందని వేచిఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా నిందితులను పట్టుకుని ప్రజల ముందు నిలబెట్టాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news