బాబు-చినబాబు రౌండప్..జగన్ చెక్ పెడతారా?

-

ఓ వైపు బాబు..మరో వైపు కొడుకు..వరుసపెట్టి..రాష్ట్రంలో తిరుగుతూ..జగన్‌ని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతూ..మరో వైపు టి‌డి‌పిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అసలు గత ఎన్నికల్లో టి‌డి‌పికి తగిలిన దెబ్బకు అసలు కోలుకోవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఓ వైపు వైసీపీ..టి‌డి‌పిపై రాజకీయ కక్ష సాధించడమే…టి‌డి‌పికి పెద్ద ప్లస్ అయింది. దాని వల్ల టి‌డి‌పిపై సానుభూతి పెరిగింది. అలాగే చంద్రబాబు ప్రజల్లోకి త్వరగా వచ్చారు..ఎక్కడకక్కడ నాయకులని యాక్టివ్ చేసి..మళ్ళీ పార్టీకి కొత్త ఊపు తెచ్చారు.

ఓ వైపు బాదుడే బాదుడు..మరోవైపు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే చంద్రబాబుని 40 ఏళ్ల నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయినా సరే ఇప్పటికీ భారీ స్థాయిలో జనం వస్తున్నారంటే..జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని అర్ధం చేసుకోవచ్చు. ఆ అంశాన్ని బాబు తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా వెళుతున్నారు. పైగా టి‌డి‌పి శ్రేణులు బాగా కసిగా ఉన్నారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు.

ఇక టి‌డి‌పికి మరింత ఊపు తీసుకొచ్చేలా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన పాదయాత్ర వల్ల పార్టీకి పెద్ద ఉపయోగం ఉండదని మొదట అంతా అనుకున్నారు. కానీ ఆయన పాదయాత్రకు ప్రజా మద్ధతు పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇలా బాబు-చినబాబు రాష్ట్రంలో రౌండప్ వేసేస్తున్నారు.

ఇదే అంశం జగన్‌కు పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. వారిని అడ్డుకోవడానికి జగన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో భారీ బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రజలు జగన్ వైపు నిలబడుతున్నట్లు కనిపించడం లేదు. అయితే ఏదొక విధంగా బాబు-కొడుకులకు బ్రేకులు వేయాలని జగన్ చూస్తున్నారు. మరి అది సాధ్యం చేస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news