స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోతుంది. కొద్దో గొప్పో బలంతో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మెల్ల మెల్లగా వైసీపీ కండువా కప్పుకునే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు జగన్ సమక్షంలో చేరిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తాజాగా వైసీపీ పార్టీలోకి వచ్చేయడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తున్న వార్తల విషయంలో కరణం బలరాం వర్గీయులు ఏ మాత్రం ప్రతిస్పందించడం లేదు.దీంతో అందరూ ఖచ్చితంగా కరణం బలరాం వైసీపీ పార్టీలో చేరిపోతున్నట్లు చీరాల నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కన్ఫామ్ అయిపోయారు. మరోపక్క జగన్ కూడా కరణం బలరాం కి సపోర్టుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చీరాల నియోజకవర్గంలో ఉన్న వైసిపి పార్టీ నాయకులు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మేటర్ లోకి వెళ్తే చీరాల లోకల్ వైకాపా క్యాడర్ అంతా ఈ నిర్ణయం తో అసంతృప్తి గా ఉంది, ఎలక్షన్ టైమ్ లో బలరాం వర్గీయుల వల్ల చాలామంది వైసిపి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాడుల దగ్గర నుంచి కేసుల వరకూ అన్నీ బలరాం ఇబ్బంది పెట్టాడు. అటువంటి బలరాం పార్టీ లోకి వస్తున్నాడు అంటే లోకల్ క్యాడర్ అంతా ఫీల్ అవుతున్నారు. ఈ నేపధ్యం లో జగన్ నిర్ణయం స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని దెబ్బ కొట్టబోతోంది అంటున్నారు విశ్లేషకులు