జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న బాలకృష్ణ.. బుల్ బుల్ బాలయ్యా.. నువ్వింక మారవయ్యా..!

-

నందమూరి బాలకృష్ణ మళ్లీ మీడియా వాళ్లకు మంచి పని పెట్టాడు. ఏపి ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా హిందుపూర్ లో ప్రచరాం చేస్తున్న బాలకృష్ణ ఓ వీడియో జర్నలిస్టుపై చేయి చేసుకున్నాడు. బాలకృష్ణ వ్యక్తిగత సిబ్బంది చిన్న పిల్లలను పక్కకు నెట్టేయడాన్ని వీడియో తీస్తుండగా అతని మీద బాలకృష్ణ చేయి చేసుకోవడమే కాకుండా నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాస్కెల్ మా బ్రతుకులు మీ చేతిలో ఉన్నాయిరా.. నరిగి పోగులుపెడతా.. ప్రాణాలు తీస్తా.. బాంబులు వేయడం కూడా తెలుసు.. కత్తి తిప్పడం నాకు వచ్చు అంటూ వివాదాస్పంద వ్యాఖ్యలు చేశాడు బాలకృష్ణ.

జనాల్లోకి వచ్చిన బాలకృష్ణ ఎవరినో ఒకరిని కొట్టంది చేతి దురద తగ్గదనుకుంటా.. ఇన్నాళ్లు ఫ్యాన్స్ ను చేయి చేసుకుని కవర్ చేసుకుంటూ వచ్చిన బాలకృష్ణ లేటెస్ట్ గా వీడియో జర్నలిస్ట్ పై చేయి చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. దీనిపై మీడియా సంఘాలు బాలయ్య మీద మండిపడుతున్నాయి. అయితే పరిస్థితి చేయి దాటిపోకూడదని బాలకృష్ణ తన ఫేస్ బుక్ ద్వారా చిల్ల పిల్ల మీద పడి వీడియో తీస్తుంటే అల్లరి మూక అనుకున్నా మీడియా వారని తెలియదు. ఉద్దేశం పూర్వకంగా చేయలేదు. మీడియా మిత్రులు దీని వల్ల బాధ పడి ఉంటే క్షమించండి అంటూ మెసేజ్ పెట్టాడు. మొత్తానికి బాలకృష్ణకు మళ్లీ పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.


Read more RELATED
Recommended to you

Latest news