భీమవరంలో పవన్ పై పోటీ చేస్తున్న ఆర్జివి.. !

-

ఆర్జీవీ.. పేరుకు మూడక్షరాలే కానీ.. ఈయన ఏం చేసినా ప్రభంజనమే. ఏం మాట్లాడినా వివాదాస్పదమే. ఆయన ఇప్పుడే కొత్తగా ఇలా ఉన్నారా? లేదు కదా.

ఆయన చిన్నప్పటి నుంచి అంతే. ఆయన మనస్తత్వమే అంత. అందుకే.. ఆయన ఏం మాట్లాడినా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. చాలామంది లైట్ తీసుకుంటారు.నిన్నటిదాకా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆర్జివి ఈరోజు మళ్లీ పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేయడం విశేషం. అప్పట్లో శ్రీ రెడ్డిని పవన్ మీదకు వదిలిన వర్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ప్రస్థావించింది లేదు. అయితే లేటెస్ట్ గా భీమవరం నుండి తాను పవన్ కు పోటీగా దిగుతున్నానని ఆర్జివి ట్వీట్ చేయడం మళ్లీ పవన్ ను వర్మ టార్గెట్ చేస్తున్నాడని అర్ధమయ్యింది. అయితే నామినేషన్స్ గడుపు పూర్తయింది మరి ఈ టైంలో ఎలా వర్మ పవన్ కు పోటీకి సిద్ధమవుతాడు అంటే తాను స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నానని.. పూర్తి వివరాల కోసం వేచి ఉండండని ట్వీట్ తో మరోసారి హాట్ న్యూస్ గా మారాడు ఆర్జివి. నామినేషన్ గడు పూర్తయ్యాక అది ఎంతటివారైనా సరే వెనక్కి తగ్గాల్సిందే. మరి అలాంటిది వర్మ ఎలా పవన్ మీద పోటీ చేస్తాడన్నది తెలియాల్సి ఉంది.



ఆర్జివి డైరెక్ట్ గా పోటీ చేయకున్నా భీమవరంలో వైసిపి అభ్యర్ధి తరపున ప్రచారంలో పాల్గొంటాడేమో చూడాలి. అయితే ఇలా ట్వీట్ చేశాడో లేదో మళ్లీ ఏమైందో ఏమో కాని వెంటనే ఇది అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ చేయడానికి వేసిన జోక్ అని.. ఇది ఏ స్టుపిడ్ నమ్మే అవకాశం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news