తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కొంతమంది నేతలు ఇప్పుడు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. అయితే బండి సంజయ్ కొంతమందిని కలుపుకొని వెళ్లే విషయంలో వివాదాస్పదంగా ఉంటున్నారు అంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే కొన్నిచోట్ల వ్యాఖ్యలు చేశారని మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.
ఐతే కిషన్ రెడ్డిని కలుపుకుని వెళ్లే విషయంలో బండి సంజయ్ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బండి సంజయ్ విషయంలో బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇచ్చి కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేసే అవకాశం ఉంది అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా విఫలమయ్యారని… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సరే తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఆయన ఇబ్బంది పెట్టలేకపోతున్నారు అనే విమర్శలు వచ్చాయి.
విమర్శలు చేసే విషయంలో కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా విమర్శలు చేయలేకపోతున్నారని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రిని చేయడం ద్వారా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చు అనే భావనలో బీజేపీ అధిష్టానం ఉందని అంటున్నారు. కిషన్ రెడ్డి ఇబ్బంది పడకుండా ఆయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో ఉగాది లోపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.