వాళ్ల బాధలు చూస్తే దుఃఖం వస్తోంది : బండి సంజయ్‌

సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఇదే పాదయాత్రలో భాగంగా.. జీఎస్టీ మినహాయించాలంటూ బండి సంజయ్‌కి చేనేత కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. జీఎస్టీ మినహాయింపునకు కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

సంచార జాతులు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. జనగామ జిల్లాలో ఐదో రోజు ప్రజా సంగ్రామ పాదయత్రలో భాగంగా… చీటకోడూరు రచ్చబండలో సంచార జాతులతో బండి సంజయ్‌ మాట్లాడారు. కేసీఆర్ సర్కారును గద్దె దించే అవకాశం వచ్చిందని వెల్లడించారు. సంచార జాతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి తామూ సంచార జీవనమే గడుపుతున్నామని బండి సంజయ్ తెలిపారు.

“మీరు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయి. కేసీఆర్ సర్కారును గద్దె దించే అవకాశం ఇదే. సంచార జాతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. ఏడాది నుంచి మేమూ సంచార జీవనమే గడుపుతున్నాం. సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశాం. భాజపా అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటాం. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి.” – బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు