తాటి ముంజలు అమ్ముకొని బతికినోడిని.. ఎంపీని చేశారు.. జగనన్న రుణం ఎలా తీర్చుకోను..!

-

బాపట్ల నుంచి వైఎస్సార్సీపీ పార్టీ తరుపున గెలిచిన నందిగం సురేశ్.. ఇటీవల విజయవాడకు వచ్చినప్పుడు తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1994 సమయంలో సురేశ్.. విజయవాడలోని వన్ టౌన్ లో ఎర్రటి ఎండలో చీమ చింతకాయలు, తాటి ముంజలు అమ్ముకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎక్కడి వాడిని. ఎక్కడ ఉండేవాడిని. కలలో కూడా పార్లమెంట్ మెట్లు ఎక్కడాన్ని ఊహించుకోలేదు. ఎంపీ పుల్ ఫామ్ కూడా తెలియనోడిని. అసలు ఢిల్లీ పేరే తెలియనోడిని. విజయవాడలో ఎర్రటి ఎండలో చీమ చింతకాయలు, తాటి ముంజలు అమ్మకొని బతికినోడిని. ఎంపీ అవుతా అని ఎన్నడూ ఊహించలేదు. కలలో కూడా ఊహించలేదు. నన్ను ఎంపీని చేసిన జగనన్నను ఏనాటికీ మరిచిపోను. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు.. అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్.

బాపట్ల నుంచి వైఎస్సార్సీపీ పార్టీ తరుపున గెలిచిన నందిగం సురేశ్.. ఇటీవల విజయవాడకు వచ్చినప్పుడు తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1994 సమయంలో సురేశ్.. విజయవాడలోని వన్ టౌన్ లో ఎర్రటి ఎండలో చీమ చింతకాయలు, తాటి ముంజలు అమ్ముకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కడు పేదరికంలో ఉన్న సురేశ్.. బతకడం కోసం కూలి పనులు కూడా చేశారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతం అయ్యారు సురేశ్. రోడ్డు మీద తాటి ముంజలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీని చేసిన జగనన్న రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటూ సురేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news