చంద్రబాబు జీవితాన్ని ధన్యం చేసిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి !

-

శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చాలా సీరియస్ గా శాసన మండలి పై చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంలో వైసిపి పార్టీ మంత్రి కొడాలి నాని వైయస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు జీవితాన్ని ధన్యం చేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Related image

విషయంలోకి వెళితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి చంద్రబాబు రాజకీయ జీవితం ఇచ్చారు అని అందరూ అనుకుంటున్నారు అని…కానీ వాటిలో వాస్తవం లేదని నారా లోకేష్ కి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పూర్తిగా మేటర్ లోకి వెళ్తే అప్పట్లో దివంగత ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేయడం జరిగింది.

 

అయితే ఆ తర్వాత 2004వ సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి మళ్లీ మండలిని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయంలో ఉన్న చెత్తనంతా మండలిలో కూర్చోబెట్టారని అసలు మండలి లేకపోతే  లోకేష్ ఎమ్మెల్యే ఎప్పుడయ్యేవాడు..? చంద్రబాబు లోకేష్ ని ఏమీ చేయలేడు. లోకేష్ కి చట్టసభల్లో అవకాశం కల్పించి మంత్రిని చేసిన ఘనత వైఎస్ కే దక్కుతుంది అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ మండలిలో పెద్దలు ఉండటం వలన సలహాలు సూచనలు వస్తాయన ఉద్దేశంతో పెట్టడం జరిగిందని కానీ శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న పెద్దలు ప్రజలకు ఉపయోగపడే బిల్లులను అడ్డుకున్నారు ఇది బాధాకరమని కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

మరోపక్క అమరావతిలో రాజధాని రైతుల చేత శాసనమండలిలో చంద్రబాబు బిల్లును అడ్డుకున్నారని అద్భుతమైన రాజకీయ చాణిక్యుడు అంటూ జేజేలు కొట్టించుకున్న చంద్రబాబుకి అసలు శాసన మండలి తిరిగి తీసుకు వచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ పుణ్యమా…చంద్రబాబు అమరావతి రాజధాని రైతుల దగ్గర తన జన్మ ధన్యం చేసుకున్నాడు అని మరో పక్క రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు కి రీసెంట్ గా వచ్చిన గెలుపు ఇదొక్కటే .. తన కొడుకుని ఎదురుకోవడానికి అతిపెద్ద ఆయుధం ఐన మండలిని చంద్రబాబు చేతిలో పెట్టిన వై యెస్ .. ఒక్క గెలుపు ఐనా ఇచ్చి చంద్రబాబు జన్మ ధాన్యం చేశారు అని తాడేపల్లి లో సటైరికల్ గా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news