బిగ్ బ్రేకింగ్; సొంత పార్టీ పెడుతున్నా; రజని కాంత్…!

-

సినీ హీరో రజని కాంత్ చెన్నై లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఏ ప్రకటన వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ళుగా నా రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వస్తున్నాయని రెండేళ్ళ క్రితమే రాజకీయ ప్రవేశం పై ప్రకటన చేశా అని ఆయన అన్నారు. నేను రాజకీయాల్లోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారు అని అన్నారు.

తమిళనాడు పరిస్థితులను విశ్లేషించడం మొదలుపెట్టానని వ్యాఖ్యానించారు. ప్రజల మనస్తత్వం మారాల్సిన అవసరం ఉందని, రాజకీయ నాయకులకు ప్రజలు అంటే ఓట్లే అని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని భావించాను అన్నారు. అత్యధిక మంది నా పార్టీలో భాగస్వాములు అయ్యే విధంగా చూసుకుంటా అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది అని రజని కాంత్ వ్యాఖ్యానించారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడి పాత్ర ఉండకూడదు అన్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉంటాను అని రజని కాంత్ వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి పీఠం మీద అంత ఆసక్తి లేదని స్పష్టం చేసారు.

సమయానికి తగిన విధంగా పాలన సాగడం లేదని రజని కాంత్ అన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతా అనే ఊహలు ఎప్పుడు లేవని రజని అన్నారు. ప్రభుత్వం పార్టీపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదు అని అన్నారు. నా పార్టీలో 65 శాతం యువకులకు మాత్రమే అవకాశం అని అన్నారు. రిటైర్ అయిన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను పార్టీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు. తాను కేవలం పార్టీ అధ్యక్షుడిగా ఉంటా అని స్పష్టం చేసారు. సమర్దులకే సిఎం పీఠం అన్నారు. దీనితో ఆయన సొంత పార్టీ పెడుతున్నట్టు స్పష్టంగా అర్ధమైంది.

నాకు మూడు ప్రణాలికలు ఉన్నాయని, నా పార్టీలో వనరుల దుర్వినియోగం ఉండదు అంటూ రజని వ్యాఖ్యానించారు. ఆయన ఏప్రిల్ 15 న పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లో ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. రజని మక్కల్ మండ్రం పేరుతో రాజకీయ పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news