ఎంత పెద్ద తప్పు చేసానే అని తల పట్టుకుంటున్న ABN RK !

-

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులు రాతలు మరి పెచ్చుమీరి పోతున్నాయి అని వైసిపి సోషల్ మీడియా ఆయనపై ఓ కథనాన్ని రిలీజ్ చేసింది. ఎప్పటినుండో బాబు కి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ నడుపుతున్నారని వైసీపీ నేతలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇటీవల జగన్ అధికారంలోకి రావడంతో జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి ఏబిఎన్ ఆర్కే చేయని ప్రయత్నాలు లేవు. అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. కాగా తాజాగా ఈ వారం కొత్త పలుకులు ఆయన రాసిన రాతలు జర్నలిజాన్ని దిగజార్చినట్లు అయిందని వైసీపీ నేతలు అంటున్నారు.

Image result for abn rk"

మేటర్ లోకి వెళ్తే జగన్ తో పని చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి తన ఆంధ్రజ్యోతి పేపర్ లో కొత్త పలుకులో ఈ విధంగా ప్రచురించారు…”….జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘గత ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాల్సింది కాదు. కానీ నేను నా వ్యూహంతో ఎన్నికల వాతావరణాన్ని జగన్‌కు అనుకూలంగా మలిచాను’’ అని ఆయన పలువురి వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.

 

ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతోపాటు చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేష భావాన్ని వ్యాపింపజేయడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నారు. ‘జగన్మోహన్‌రెడ్డి పాలన ఇలా ఉంటుందని అనుకోలేదు. నేను చంద్రబాబుకే కాదు,ఆంధ్రప్రదేశ్‌కు కూడా అన్యాయం చేశాను’’ అని ఆయన ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారట…” దీంతో ఈ వార్తలను సోషల్ మీడియా టార్గెట్ చేస్తోంది. చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి కొమ్ము కాస్తూ…ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నేనే నాశనం చేశాను..అంటూ ఏబీఎన్ ఆర్కే పెద్ద తప్పు చేశాను అని తల పట్టుకున్నట్లు కౌంటర్లు వేస్తూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.  

Read more RELATED
Recommended to you

Latest news