బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాకులు.. ఓ వైపు కవిత అరెస్ట్.. మరోవైపు నేతల జంప్..

-

ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. టికెట్ రాని ఆశావహులు గులాబీ జెండాను వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

brs party
brs party

తెలంగాణ‌లో ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ప్రస్తుతం గ్రహ‌స్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌వితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా… మ‌రోవైపు సీనియ‌ర్ నేత‌లు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌, బీజేపీలో చేరుతున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈనెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.. 23న తిరిగి కవితను కోర్టులో హాజరుపర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.. కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని తెలిపింది. స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని స్పష్టం చేసింది. సౌత్ లాబీలో మిగతా వారు శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని.. ఆప్ నేతలతో 100 కోట్ల ముడుపుల డీల్ చేసింది ఆమెనే అని స్పష్టం చేసింది.

మరోవైపు… లోక్‌సభ ఎన్నికల ముందు ముఖ్యనేతలు బీఆర్ఎస్‌ను వీడుతుండటం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. తాజాగా పలువురు నేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరో ఇద్దరు రాజీనామా చేయనున్నారు. నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇటీవల జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ రాజీనామా చేశారు. తాజాగా వ‌ర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్, చేవెళ్ల ఎంపీ ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు.. రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు.

సంవత్సరాలుగా బీఆర్ఎస్‌తో అనుబంధంగా ఉండి అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ.. అధిష్టానం తమ కష్టాన్ని గుర్తించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బీఆర్ఎస్‌లో సముచిత స్థానం దక్కక పోవడంతోనే.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news