దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే కోడ్ అమలులోకి వచ్చింది. జూన్ 02 వరకు ఎన్నికల కోడ్ ఉండనుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొన్ని నియమ, నిబంధనలు పాటించాలని ఈసీ సూచించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలను చేయకూడదని.. మత విద్వేశాలు రెచ్చగొట్టొద్దని పేర్కొంది ఈసీ.
తాజాగా సీఈవో వికాస్ రాజ్ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసీ ఆదేశాలతో 85 ఏళ్లు నిండిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. మరో మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుంది. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తులను తీసుకుంటున్నామని తెలిపారు వికాస్ రాజ్. రూ.50వేల కంటే ఎక్కువగా తీసుకెళ్లకూడదు. ఒకవేళ రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే సరైన సరైన పత్రాలు చూపించారు.