భీమ్లానాయక్ సినిమా ఫ్లాప్ అయింది.. మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘ భీమ్లానాయక్’పై పొలిటికల్ వివాదం రాజుకుంటుంది. భీమ్లానాయక్ ను వేధించేందుకే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై జీవోను తీసుకురాలేదని జనసేన, టీడీపీ పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా ఏపీ ప్రభుత్వం తీరుపై ఫైర్ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ .. భీమ్లానాయక్ సినిమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అయిందని.. ఆ వైఫల్యాన్ని మాపై రుద్దేందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాటకాలు అడుతున్నారని విమర్శించారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని కొంతైనా బయటపడాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అఖండ మూవీటైంలో ఉన్న జీవోనే ఇప్పటికీ అమల్లో ఉందని.. ఫ్లాప్ సినిమాకు మార్కెటింగ్ చేస్తున్నారంటూ.. మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అంతకు ముందు కొడాలి నాని కూడా భీమ్లానాయక్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి అఖండ అయినా.. బంగార్రాజు అయినా.. భీమ్లానాయక్ అయినా సమానమే అంటూ వ్యాఖ్యలు చేశారు.