ఈట‌ల‌కు ఢిల్లీలో ఛేదు అనుభ‌వం?

ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ ఇప్పుడు హాట్ పాలిటిక్స్ నెల‌కొన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న ఏ పార్టీలో
చేర‌తారో అని అంతా ఆస‌క్తిగా ఎద‌రుచూశారు. వ‌రుస‌గా కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. కానీ ఫైనల్‌గా ఆయ‌న బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నిన్న ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే అక్క‌డ ఆయ‌న‌కు కాస్త ఛేదు అనుభ‌వం ఎదుర‌యిన‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం కావటానికి వెళ్లిన ఈటలతో పాటు.. ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. వివేక్ ఇతర నేతలు వెళ్లారు. అయితే న‌డ్డా ఇంటికి వెళ్ల‌గానే ముందుగా బండి సంజయ్.. వివేక్ ను పిలిచి మాట్లాడారు న‌డ్డా.

వీరితో న‌డ్డా స‌మావేశం జ‌రిప‌నంత సేపు ఈటల.. ఏనుగు రవీందర్ రెడ్డి బయట వెయిట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బండి సంజ‌య్‌, వివేక్ నుంచి బ్రీఫ్ గా మ్యాట‌ర్ తెలుసుకున్న త‌ర్వాత‌ ఈటల రాజేంద‌ర్‌ను లోపలకు పిలిచినట్లుగా అక్క‌డి మీడియా చెబుతోంది. అయితే వారి నుంచి ముందే స‌మాచారం తెలుసుకుని ఉండే బాగుండేద‌ని, ఈట‌ల రాగానే సాద‌రంగా ఆహ్వానించి ఉంటే బాగుండేద‌ని అంతా అనుకుంటున్నారు.