తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత, తనదైన దూకుడు, స్వరాష్ట్రం సిద్ధం చేసుకోవాలనుకునే బలమైన ఆకాంక్ష, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వాక్చాతుర్యం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీ రాసుకున్న ఉద్యమ నాయకుడు ఈటెల రాజేందర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయనే తొలి ఆర్ధికమంత్రిగా పని చేసి రాష్ట్ర రాజాకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈటల రాజేంద్ర రాజకీయ ప్రస్థానం.
1964 మార్చి 20న కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్‌లో పెద్ద మల్లయ్య దంపతులకి ఈటల జన్మించారు. 1984లో ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీఎస్‌సీ పట్టా పొందిన రాజేంద్రుడు.. కాలేజీలో ఉన్నప్పుడే లెఫ్ట్ విద్యార్థి సంఘంలో కీలకంగా వ్యవహరించారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయినా తన పుట్టిన గడ్డకి తనకి చేతనైన అంత చేయాలనే తపన ఈటలను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. 1986లో జమునను వివాహం చేసుకున్నారు. అనంతరం వ్యాపారాల బాధ్యతలు భార్యకు అప్పగించి రాజకీయాల వైపు అడుగులు వేశారు ఈటల రాజేంద్ర.
కాలేజీ సమయంలోనే 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఈటల 1972లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నవారు. 2003లో బీఆర్ఎస్ పార్టీతో ఈటల తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టారు. 2004లో మొదటిసారిగా అప్పటి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప అభ్యర్జి టిడిపి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న దామోదర్ రెడ్డిని మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడి 68,393 ఓట్లు సాధించి 1963 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజయకేతనం ఎగరవేశారు ఈటల. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కమలాపూర్ నుంచి కాకుండా హుజురాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమోహన్ రావుపై 56,752 ఓట్లు సాధించారు రాజేందర్.
ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం, అనంతరం 2009 సెప్టెంబర్ 2న వైయస్ఆర్ మరణించడంతో.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. ఈ సమయంలో కరీంనగర్ నుండి ఈటల రాజేందర్ ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల స్వరాష్ట్రం ఏర్పడాక 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సుదర్శన్ రెడ్డి పై ఏకంగా 57,307 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి ఆయన విజయం సాధించారు. 2018 వరకు బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. రెండో దఫా ఈటల రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవిని చేపట్టి ఎల్లప్పుడూ ప్రజలకు చేరువలోనే ఉండేవారు.
ఇదిలా ఉండగా.. ఈటెల రాజకీయ జీవితంలో ఊహించని మలుపు.. 2021లో ఈటెల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలతో మే 2న మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. అనంతరం . జూన్ 4న ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈటెల రాజేందర్.
భూ కబ్జా ఆరోపణలని రాజకీయ దుర్బుద్ధితో చేసినవే కానీ, నిజాలు కాదు.. తాను ఎప్పుడు ప్రజానాయకుడినే అని తనని ప్రజలు నమ్మితే చాలు అని నమ్మి, అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేసారు. తన నిజాయితినీ నమ్మిన ప్రజలు 23, 855 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేంద్రను అఖండ మెజార్టీతో గెలిపించారు. అనంతరం 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా మరోసారి హుజూర్ నగర్ నుండి గజ్వేల్ నుండి ఈటల రాజేందర్ పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. కానీ, ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈటల ఓటమికి కృంగిపోకుండా ప్రజలు కోసం ప్రజానాయకుడిగా ఎల్లపుడు ప్రజల్లో ఉండటానికి మల్కాజ్ గిరి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.