ఆరోపణ: సింగారేణిని దోచుకుంటున్న ఎమ్మెల్సీ కవిత

Join Our Community
follow manalokam on social media

కోట్ల ఆదాయం రాబట్టుతున్న సింగరేణిని ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటుందని బీజేపీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చూగ్‌ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పర్యటించిన ఆయన, కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిని ఎమ్మెల్సీ కవిత యూనియన్‌ లీడర్‌గా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సింగరేణిలో అధికారం చేలాయిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. అధికారులందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తున్నారన్నారు. సింగరేణి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తామని తరుణ్‌చూగ్‌ పేర్కొన్నారు.

అనినీతికి అడ్డాగా..

సింగరేణి అనినీతికి అడ్డాగా మారిందని దాన్ని చూసి తాము ఊరుకోమన్నారు. సీఎండీ తన విధులు వదిలేసి టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నారని విమర్శంచారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ పాలన వస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికులను భయాందోళనకు గురిచేస్తూ విధులు నిర్వర్తించుకుంటున్నారని ఆరోపించారు.

కార్మికులు, కార్మిక నేతలపై ఆదిపత్యం చేలాయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. సింగరేణి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే రాష్ట్రంలోని తమ పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. భయభ్రాంతులకు గురిచేసి పాలిస్తే ఆ పార్టీ కుప్పకూలిపోతోందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు పాల్పడిని అనినీతిని బయటకు లాగుతామన్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...