డ్రగ్స్ టెస్టుల లొల్లిలోకి బీజేపీ లీడర్.. దేశరాజధానిలో టెస్టులు చేయాలట

-

తెలంగాణ రాష్ట్రరాజకీయం రోజురోజుకూ బాగా వేడెక్కుతోంది. మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్టు చేయించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. దాంతో కౌంటర్‌గా తాను ఏ టెస్టుకైనా సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గ్రీన్ చాలెంజ్ తరహాలో వైట్ చాలెంజ్‌ను స్వీకరించాలని మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లను కేటీఆర్ నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వారిని హైదరాబాద్ అమరవీరుల స్థూపం వద్దకు రావాల్సిందిగా కోరారు. ఈ సంగతులు ఇలా ఉంచితే తాజాగా ఈ డ్రగ్స్ టెస్టుల లొల్లిలోకి బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్య రఘునందర్ ఎంట్రీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కలిపి డ్రగ్స్ టెస్టు చేయించాలని, అది కూడా దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద చేయాలన్నారు. డ్రగ్స్ టెస్టులకు అయ్యే ఖర్చును తానే భరిస్తానన్న రఘునందన్ సంచలన కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే రఘునందన్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ను విమర్శించారు. రేవంత్, కేటీఆర్ ఉపయోగిస్తున్న భాషను చూస్తుంటే అసహ్యమేస్తున్నదని, తెలంగాణ ప్రజానీకం ఆ భాషను గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నిర్మల్ సభకు పోటీగా కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ నియోజకవర్గంలో సభ నిర్వహించారన్న అనుమానం తమకుందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధమని, అందుకే కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ మొదలు తన సభకు హాజరు కాని పార్టీలో ఉన్న సీనియర్ నేతల గురించి తెలుసుకోవాలని, సొంత పార్టీలోని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్, అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.
రఘునందన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news