ఏపీ పాలిటిక్స్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. క్రమంగా ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి టిడిపి టిడిపి జనసేన పొత్తులకి బీటలు వాలుతున్నాయి. బిజెపి హై కమాండ్ ఆపరేషన్ ఆంధ్ర ప్రదేశ్ ని చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీలో కాపు నినాదం అందుకోవాలని పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాపు సీఎం పై అధికారక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీసీ సీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదం బిజెపి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సీఎంల నేపథ్యంలో కాపులకి దగ్గర కి చేర్చుకునే వ్యూహాన్ని బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంకో పక్క ఆపరేషన్ ఆకర్ష తో భారీగా చేరికల మీద ఫోకస్ పెట్టబోతోంది. వైసిపి టిడిపిలో టికెట్ దక్కని వాళ్ళ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే బిజెపితో 30 నుండి 40 మంది లీడర్లు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది బిజెపి స్ట్రాటజీ ఒక్కసారిగా మారిపోవడంతో టీడీపీ జనసేన రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.