బ్రేకింగ్: ఏపీ ప్రజలకు అండగా తెలంగాణా ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా వెళ్లి కరోనాతో బాధపడుతూ చికిత్స చేయించుకోవాలి అని భావించిన వారిని తెలంగాణా పోలీసులు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. హైకోర్ట్ చెప్పినా సరే అనుమతి ఉంటేనే తెలంగాణా కు కరోనా రోగులను అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్న అంశంగా చెప్పాలి. ఇక ఈ అంశంలో రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి.

తాజాగా దీనిపై తెలంగాణా బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రజల ఓట్లు మాత్రం కావాలి గాని వాళ్లకు చికిత్స చేయించరా అంటూ ప్రశ్నించారు. తెలంగాణా రావాలి అంటే పత్రాలు అడుగుతున్నారని… అంబులెన్స్ లను ఎందుకు అడ్డుకున్నారు అని ఆయన నిలదీశారు. ఇది మానవత్వం కాదని ఆయన అన్నారు.