రాష్ట్రంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోనుంది. టీడీపీ పని అయిపోయింది. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం.. అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు.
నో డౌట్. ఆంధ్రా ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయారు. మేం ఎంత చెప్పినా వినలేదు. ప్రాంతీయ పార్టీలు అన్నీ భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. ఓటర్లను కొనుక్కున్నాయి. పాత రోజుల్లో బీహార్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న పరిస్థితులను ఈ ఎన్నికలు గుర్తు చేశాయి.
ధన రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలని ప్రతి పార్టీ తాపత్రయ పడుతోంది. అయితే.. రాష్ట్రంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోనుంది. టీడీపీ పని అయిపోయింది. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం.. అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు.ఎన్నికల్లో ఏరులై పారుతున్న ధన ప్రవాహం గురించి చంద్రబాబు, జగన్ ఎందుకు మాట్లాడరంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజలు వ్యతిరేకత చూపించారని ఆయన స్పష్టం చేశారు. ఈసారి ఎక్కువ మంది సిట్టింగ్ లు ఓడిపోవడం ఖాయమన్నారు.
టీడీపీ ఎలాగూ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి.. ఏపీలో టీడీపీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని ఆయన వెల్లడించారు.