హుజూర్‌న‌గ‌ర్లో ఆ పార్టీ ఓట‌మి డిసైడ్ అయిన‌ట్టే..!

-

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక అన్ని ప్ర‌ధాన పార్టీల‌కు అగ్నిప‌రీక్ష‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్‌, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దీనిని అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో అమీతుమీ తేల్చుకు నేందుకు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆయా పార్టీల వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌తో పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ఆయా పార్టీల నేత‌లు హుజూర్‌న‌గ‌ర్‌లో మ‌కాం వేశారు.

రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు తామే ప్ర‌త్యా మ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ ఉప ఎన్నిక అత్యంత కీల‌కంగా మారింది. ఇక్క‌డ కాంగ్రెస్, టీఆర్ ఎస్ నుంచి రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు పోటీలో ఉన్న నేప‌థ్యంలో బీజేపీ నుంచి అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు టికెట్ ఇవ్వాల‌ని పార్టీ తొలుత పార్టీ భావించింది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ నుంచి శ్రీకళా రెడ్డి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. ఈక్ర‌మంలోనే అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోట రామారావును రాష్ట్ర కార్యవర్గం ఎంపిక చేసింది. టికెట్‌ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కోటా అప్పిరెడ్డి ఉండగా చివరకు రామారావుకు టికెట్‌ దక్కింది. మొదట శ్రీకళా రెడ్డికి టికెట్ ఖరారు అవ్వగా కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోటీ నుండి తప్పుకున్నారు. కాగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు.

ఇక మ‌రోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌న్న ఉద్దేశంతో ఏకంగా 70 మంది ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించింది. కేసీఆర్ ఇక్క‌డ గెల‌వాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ సైతం గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జానారెడ్డి లాంటి నేత‌లు ఒక్క‌ట‌వుతున్నారు. ఈ రెండు పార్టీలు దూసుకుపోతుంటే బీజేపీ ఎంతో గొప్పలు చెప్పి గ‌ట్టి అభ్య‌ర్థినే పోటీకి పెట్ట‌లేకపోయింద‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news