హైదరాబాద్‌లో ఎం‌ఐ‌ఎంకు సెట్.. కానీ కారుకు కమలంతో కష్టమే..!

-

తెలంగాణలో అతి పెద్ద జిల్లా హ్యెదరాబాద్…రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న జిల్లా ఇదే. ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా 15 సీట్లు ఉన్న జిల్లా హైదరాబాద్. అందుకే ఈ జిల్లాపై రాజకీయ పార్టీలు ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాయి. ఇక్కడ మంచి ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇక్కడ ఎం‌ఐ‌ఎం పార్టీకి ప్రత్యేకమైన బలం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో సగం సీట్లలో ఎం‌ఐ‌ఎంకు బలం ఉంది.

bjp-trs
bjp-trs

ఆ సీట్లు వదిలేసుకుని మిగిలిన పార్టీలు పోటీ పడాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడ ఎం‌ఐ‌ఎం, కాంగ్రెస్‌లకు మంచి పట్టు ఉండేది. అలాగే టీడీపీ సైతం మంచి ఫలితాలు సాధించేది. కానీ తెలంగాణ వచ్చాక ఇక్కడ పరిస్తితి మారింది. టీఆర్ఎస్, ఎం‌ఐ‌ఎంలు సత్తా చాటుతున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ ఆ పార్టీలదే పైచేయి. మొత్తం 15 సీట్లు ఉంటే ఎం‌ఐ‌ఎం 7, టి‌ఆర్‌ఎస్ 7, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది.

ఇక ఇక్కడ ఎం‌ఐ‌ఎంకు ఉన్న సీట్లలో వేరే పార్టీలు గెలవడం చాలా కష్టమైపోతుంది. ఆఖరికి టి‌ఆర్‌ఎస్ సైతం ఏదో నామమాత్రంగానే ఆ సీట్లలో పోటీ చేసి…మిగిలిన సీట్లలో ఎం‌ఐ‌ఎం పార్టీ సపోర్ట్ తీసుకుని గెలుస్తుంది. ప్రస్తుతం ఎం‌ఐ‌ఎం పార్టీకి మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణగుట్ట, ఛార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలు ఇంకా ఎం‌ఐ‌ఎంకు రిజర్వ్ చేసినట్లే అని చెప్పొచ్చు.

అయితే మిగిలిన స్థానాల్లో టి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా బి‌జే‌పి వచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో కారుకు కమలం గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. టి‌ఆర్‌ఎస్ చేతుల్లో ఉన్న ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో బీజేపీ బలపడుతుంది. నెక్స్ట్ ఈ సీట్లలో కారుకు కమలం చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మూడు, నాలుగు స్థానాలని గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news