నా మేనల్లుడే సిఎం… ఆ పార్టీని చీల్చడానికి బీజేపి ప్రయత్నాలు చేస్తుందా…?

-

ఎన్నికలొస్తే తన మేనల్లుడే సీఎం అంటున్నారు… శివపాల్ యాదవ్… రాజకీయంగా జన్మను ఇచ్చిన… సమాజ్ వాదీ పార్టీని కాదని బయటకు వచ్చి ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ (లోహియా)ను స్థాపించిన శివపాల్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సామాజ్ వాదీ పార్టీ పొత్తుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష తనకు లేదని, గతంలోనూ చెప్పినట్టు పేర్కొన్న ఆయన… మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) పుట్టినరోజైన ఈనెల 22న కుటుంబసభ్యులంతా ఐక్యమత్యం చాటుకోవాలని తాను కోరుకుంటున్నట్టు శివపాల్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి అయ్యేలా చూస్తామని, ములాయం తో కలిసి పని చేశామని, అందుకే ఆ పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. తన మేనల్లుడు అర్ధం చేసుకుంటే ఆయనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని శివపాల్ యాదవ్ అన్నారు. ఎప్పుడో 2022 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శివపాల్ యాదవ్ ని బీజేపీ రంగంలోకి దింపిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మీద వ్యతిరేకత ఉందని, ఇదేతరుణంలో ఎస్పీ బలపడుతుందని, మాయావతితో పొత్తు తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాలు పార్టీని బలపరుస్తున్నాయని, అందుకే ఇప్పటి నుంచే బీజేపీ రంగంలోకి దిగి, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకునే విధంగా… విపక్షాలను బలహీనపరిచే విధంగా అడుగులు వేస్తుందని, అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం ఎస్పీని టార్గెట్ చేసిందని అంటున్నారు. ఎస్పీలో చీలిక కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. శివపాల్ యాదవ్ వర్గం ఇంకా ఎస్పీలోనే ఉందని, వాళ్ళు 2017 ఎన్నికల్లో ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ వర్గమే కొంప ముంచిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇప్పుడు కుటుంబంలో కూడా చీలిక కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టి శివపాల్ యాదవ్ ని రంగంలోకి దింపిందని, అఖిలేష్ జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news