జగన్ ని టార్గెట్ చేసిన బిజెపి…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నేపధ్యంలో ఇప్పుడు దీనిపై తీవ్ర దుమారం రేగుతుంది. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ, వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని, కాస్తో కూస్తో బలపడాలని చూస్తున్న బిజెపి టార్గెట్ చేసింది.

మరి ఎవరి సహకారంతో బిజెపి జగన్ ని టార్గెట్ చేస్తుందో తెలియదు గాని ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు అంటూ బిజెపి నేతలు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తల మీద జరిగిన దాడులను కూడా బిజెపి భుజానికి ఎత్తుకుంది. జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇక ఎన్నికలను వాయిదా వెయ్యాలని బిజెపి ఎంపీలు ఫిర్యాదు చేసారు.

ఎన్నికల్లో పలానా అక్రమాలు జరుగుతున్నాయని అమిత్ షా కు ఒక నివేదిక కూడా ఇచ్చుకున్నారు బిజెపి నేతలు. ఆ తర్వాతే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక రాష్ట్ర బిజెపి అయితే టీడీపీ తప్పులు ఉన్నా సరే ప్రస్తావించడం లేదు. ఇప్పుడు బిజెపి… టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వెళ్ళాలి అని భావిస్తుంది.

సోషల్ మీడియాలో బిజెపి నాయకులు జగన్ లక్ష్యంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వలన బిజెపికి వచ్చే లాభం ఏంటో తెలియదు గాని ఆ పార్టీ టీడీపీకి దగ్గర కావాలని చూస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టీడీపీ కి దగ్గర కావడానికే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని నిర్ణయాలు కేంద్రం నుంచి వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news