ఈటల రాజందర్ చేరికతో అనూహ్యంగా బీజేపీ బలం పెరిగిపోయిందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నేతగా ఈటలరాజేందర్‌కు పేరుంది. ఆయనలకు అధికార పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్‌లో అసంతృప్తులను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ BJP ఫోకస్ పెడుతోంది.
ఇందుకోసం జిల్లాల వారీగా పట్టున నేతలపై గురి పెడుతోంది. ఇదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అధికార పార్టీలో ఉంటూ జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కమలం గూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా ఉమ్మడి ఖమ్మంలో బలమైన నేతగా ఉంటూ పదవి లేకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు మాజీఎంపీ. కేటీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీని వీడొద్దని ఇప్పటికే ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ఈటల రాజేందర్ స్వయంగా రంగంలోకి దిగి మరీ ఆయన్ను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ ఎస్ పదవి ఇస్తే ఓకే లేదంటే మాత్రం కచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారని సమాచారం.