బ్రేకింగ్; చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చిన అయిదుగురు ఎమ్మెల్యేలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అడ్డుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పరిస్థితులు కలిసి రావడం లేదని ఎక్కువగా వినబడుతున్నాయి. ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ జరుగుతుంది. ఈ భేటీకి హాజరు కావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నాసరే రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

సిఆర్డిఏపై మనీ బిల్లు పెడితే ఏం చేయాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, అశోక్ అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని రాలేదు. దీంతో వారు సోమవారం అసెంబ్లీ కి వస్తారా లేదా అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ లోకి వెళ్తారు అని కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రచారం జరుగుతుంది.

అందులో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ పేరు కూడా వినపడుతుంది. టీడీఎల్పీ సమావేశానికి రాకపోవడంతో వీరిలో ఎవరు అసెంబ్లీకి వస్తారు ఎవరు బిజెపి లోకి వెళ్తారు లేదా వైసీపీలోకి వెళ్తారా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తనకు మద్దతు లేక అసెంబ్లీలో ఇబ్బందిపడుతున్న చంద్రబాబుకు ఎమ్మెల్యేల వైఖరి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

టీడీఎల్పీ సమావేశానికి రాకపోవటంతో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావటం లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ పరిణామంపై ఆసక్తిగా ఏం జరుగుతుందనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికి అమరావతి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news