పెద్దపల్లిలో కారుకు కాంగ్రెస్‌తోనే పోరు.. కమలంకు నో ఛాన్స్.!

-

ఒకప్పుడు కాంగ్రెస్..ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోట అయిన పెద్దపల్లి పార్లమెంట్ లో రాజకీయ పోరు చాలా ఆసక్తికరంగా మారింది. మరొకసారి ఇక్కడ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడవనుంది. అయితే గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. టి‌డి‌పి మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో పెద్దపల్లిని బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

- Advertisement -

అయితే పార్లమెంట్ లోనే కాదు..పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా బి‌ఆర్‌ఎస్ హవా ఉంది. గత రెండు ఎన్నికల్లో అదే పరిస్తితి. పార్లమెంట్ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో మంథనిలో కాంగ్రెస్ గెలవగా, రామగుండంలో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే బి‌ఆర్‌ఎస్ లోకి రావడంతో ఇండిపెండెంట్ గా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో పెద్దపల్లి పరిధిలో బి‌ఆర్‌ఎస్ హవా ఎక్కువైంది. అయితే నిదానంగా కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాస్త పాజిటివ్ తగ్గుతుంది.

కాకపోతే ప్రతిపక్షాలు అయినా కాంగ్రెస్, బి‌జే‌పి పెద్దగా బలం లేకపోవడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్ద ప్లస్. అయితే కాంగ్రెస్ కాస్త పట్టు పెంచుకోవడానికి చూస్తుంది. ఈ సారి ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే. గత పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం, మంథనిలో కాంగ్రెస్ కు లీడ్ రాగా, మిగిలిన స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది.

అయితే ప్రస్తుతం మంథని, రామగుండంల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. అదే సమయంలో పెద్దపల్లి అసెంబ్లీ లో కూడా కాంగ్రెస్ పికప్ అవుతుంది. అటు ధర్మపురిలో గట్టి పోటీ ఇస్తుంది. చెన్నూరు, బెల్లంపల్లిలో పెద్దగా బలం లేదు. మంచిర్యాలలో కాస్త పర్లేదు. అయితే ఈ పరిధిలో బి‌జే‌పికి పెద్ద బలం లేదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...