ఏపీలో ఎన్నికల జాతరకు తెరలేచింది. వరుస పెట్టి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఏపీలో వరుస పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాను వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. వంశి వైసీపీ లో చేరితే గన్నవరం అసెంబ్లీ స్థానానికి కచ్చితంగా ఉప ఎన్నిక రానుంది.
వైసిపి అధినేత జగన్ రూల్స్ ప్రకారం పార్టీ వాళ్లు కచ్చితంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న విషయం తెలిసిందే. ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తుండటంతో వాళ్లు కూడా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే ఆ స్థానాలకు కూడా కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఈ రాజీనామాలకు సంగతి పక్కన పెడితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గత అక్టోబర్ లోనే ఉమ్మడి హైకోర్టు ఆదేశించిన ఎంతవరకు దానిని అమలు చేయలేదు.
తాజాగా ఇప్పుడు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మూడు నెలల్లోగా నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ టైంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలు కల్పించే ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లు రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నవీన్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఏదేమైనా ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ప్లాన్‌తో ఉన్నారు. ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్‌లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే మునిసిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. సంక్రాంతి తర్వాత ముందుగా పంచాయతీలు, ఆ వెంటనే మేలో మండల, జిల్లా పరిషత్‌లు.. ఆ వెంటనే వచ్చూ జూన్ – ఆగస్టు నాటికి మిగిలిన మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ వెంటనే ఎమ్మెల్యేల రాజీనామాలతో మళ్లీ ఉప ఎన్నికలతో మళ్లీ ఏపీ పాలిటిక్స్ హీటెక్కనున్నాయి.