5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అనర్హత లేక, ఎమ్మెల్యే అభ్యర్థి మరణించడం, లేకపోతే రాజీనామా చేయడం వంటి కారణాల వల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వీటన్నింటికీ ఎన్నికలు జరుగనున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో అసన్ సోల్, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానాలకు, చత్తీస్గడ్ లో ఖైరా ఘర్, బీహార్ బొచా హన్, మహారాష్ట్ర కొల్హాపూర్ నార్త్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 17న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవ్వనుండగా… మార్చి 24 వరకు తుది గడువు ఉండనుంది. నామినేషన్లకు తుది గడువు మార్చి 28 కాగా.. పోలింగ్ ఎప్రిల్ 12న జరుగనుండగా.. ఎప్రిల్ 16న కౌంటింగ్ జరుగనుంది.
Election Commission announces date for bye polls in West Bengal, Chhatisgarh, Bihar & Maharashtra pic.twitter.com/WqMELdk02W
— ANI (@ANI) March 12, 2022