19న కేబినేట్ మీటింగ్; కేసీఆర్ నిర్ణయం ఏంటీ…?

-

తెలంగాణాలో కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తుంది. అత్యంత వేగంగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణా సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ని విధిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ని పక్కాగా అమలు చెయ్యాలని సర్కార్ భావిస్తుంది.

ఇక ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని మే 3 వరకు పెంచుతూ నిర్ణయం వెల్లడించారు. ఈ నేపధ్యంలో తెలంగాణా కేబినేట్ ఈ నెల 19 న ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ని మే మూడు వరకు ఉంచాలా లేక ఏప్రిల్ 30 వరకే ఉంచాలా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కేసుల తీవ్రత విషయంలో కేసీఆర్ కాస్త కంగారు గా ఉన్నారు

ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పక్కాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే కరోనా ఆగడం లేదు. ప్రస్తుత౦ 8 జిల్లాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో హాట్ స్పాట్స్ గా గుర్తించారు. ఇక్కడ మే 3 వరకు కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. లాక్ డౌన్ సడలిస్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చెయ్యాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news